సత్యసాయి: ఓడీసీ మండలం చెరువు మునెప్పగారిపల్లెలో వింత ఘటనా చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ లక్ష్మీనరసు ఆవు రెండు తలలు, మూడు కళ్లతో ఉన్న లేతదూడకు జన్మనిచ్చింది. ఈ విచిత్రాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దైవాంశసంభూతుడిగా భావించి గ్రామస్తులు ఆ దూడకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మూడు కళ్లతో దూడ జననం


