GNTR: తెనాలి చెంచుపేటలోని పాలబూత్‌ల వద్ద పాల ప్యాకెట్లు చోరీ చేస్తున్న అంగలకుదురుకు చెందిన బెల్లంకొండ ప్రవీణ్‌ను స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంగం డైరీలో లారీ డ్రైవర్‌గా పనిచేసిన ప్రవీణ్ కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి నిఘా పెట్టి అతడిని పట్టుకుని కట్టేసి త్రీ టౌన్ పోలీసులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
పాల ప్యాకెట్ల చోరీ.. పట్టుకున్న స్థానికులు


