హైదరాబాద్: 28°C
వార్తలు

కలుషిత బిర్యానీ.. రూ.96,500 జరిమానా

కేరళలోని పథనంథిట్ట జిల్లా వినియోగదారుల ఫోరం కీలక తీర్పునిచ్చింది. కింగ్స్‌ బిర్యానీ కేఫ్‌లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన బాధితురాలు రీనాకు రూ.96,500 జరిమానా చెల్లించాలని యజమాని ఆశిష్‌‌ను ఆదేశించింది. గతేడాది అక్టోబరులో కేఫ్‌లో అరేబియన్ బిర్యానీ తిన్న ఆమెకు వాంతులు, కడుపునొప్పి రావడంతో వారం పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది.