హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువుల ఆందోళన

SDPT: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో సందే రాములు (54) మృతి చెందారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఊపిరితిత్తులు, కాలేయ ఇన్‌ఫెక్షన్‌తో ఈ నెల 21న ఆసుపత్రిలో చేరిన రాములు చికిత్స పొందుతూ కోలుకున్నారని తెలిపారు. ఆదివారం ఛాతీలో నొప్పి రావడంతో సిబ్బందికి చెప్పినా సకాలంలో వైద్యం అందలేదని ఆరోపించారు.