హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గంటాకు వినతి

VSP: పీఎంపాలెం ఉస్మానియా ముస్లిం కాలనీలో నివసిస్తున్న 63 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును లబ్ధిదారులు కోరారు. ప్రభుత్వ సలహాదారు ఎం.ఏ. షరీఫ్స్ కలిసి ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని గంటా హామీ ఇచ్చారు.