శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుతోంది. ఆదివారం సాయంత్రం 20 గేట్లు ఎత్తి వంశధార నదిలోకి దిగువకు నీటిని విడుదల చేశారు. వంశధార ఇన్‌ఫ్లో 19,500, డౌన్‌ఫ్లో 27,487 క్యూసెక్కులుగా నమోదైనట్లు డీఈ సరస్వతి తెలిపారు. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
వంశధారకు పొటెత్తిన వరద నీరు


