హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల పేరిట ఫోన్ కాల్.. భారీ మోసం

MHBD: పోలీసుల మంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు కేసముద్రానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి దేశబోయిన కుమారస్వామి నుంచి రూ. 78 వేల రూపాయలు ఆన్‌లైన్‌లో కాజేశారు. ఎస్సై క్రాంతికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులకు డబ్బు అవసరమని నమ్మబలికి మూడు విడతల్లో నగదు బదిలీ చేయించుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.