హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 6,344 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు

అనకాపల్లి జిల్లాలో 24 మండలాల పరిధిలోని 646 గ్రామ పంచాయతీలకు సంబంధించి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదలైంది. మొత్తం 6,276 వార్డులకు 6,344 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు.వీటి పరిధిలో 12,28,246 మంది ఓటర్లు ఉన్నారు.మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో జాబితాలను ప్రదర్శించారు. ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని డీపీఓ సందీప్ తెలిపారు.