హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతి వివాహానికి రామలింగారెడ్డి ఆర్థిక సాయం

సత్యసాయి: బుక్కరాయసముద్రం మండలం సిద్ధారంపురంలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి వివాహానికి మాజీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. బండారు కుళ్లాయప్ప మనవరాలి పెళ్లికి ఆయన ఈ సాయం అందజేశారు. కార్యక్రమంలో చెరువు ప్రెసిడెంట్ పెద్ద శివయ్య, పాఠశాల కమిటీ ఛైర్మన్లు లింగమయ్య పాల్గొన్నారు.