కోనసీమ: మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సీహెచ్. శిరీష, జిల్లా నైపుణ్య అధికారి హరి శేషు తెలిపారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాలో 13 ప్రముఖ కంపెనీల్లో సుమారు 950 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చునని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మండపేటలో మెగా జాబ్ మేళా


