హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపు

NTR: విజయవాడ దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు జరుగుతుంది. దేవస్థానం సిబ్బందితోపాటు ముందుగా అనుమతి తీసుకున్న స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు కూడా కానుకల లెక్కింపులో పాల్గొంటారని అధికారులు తెలిపారు.