హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు ఏలేశ్వరం మండలం, భద్రవరం గ్రామంలో వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఏలేశ్వరం మండలం, సిరిపురం గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.