హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్తమూరులో టీడీపీలోకి చేరికలు

కోనసీమ: మండపేట మండలం అర్తమూరు గ్రామంలో వివిధ పార్టీలకు పలువురు టీడీపీలో చేరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.