హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: వేపగుంట ఫీడర్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ సింహాచలంనాయుడు తెలిపారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నరవ, దుర్గానగర్, జెర్రిపోతులపాలెం, ఇప్పిలివానిపాలెం, చింతగట్ల, రెల్లి కాలనీ, హైస్కూల్ రోడ్డు, మన్నెపాలెం తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.