హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో ఉండాల్సిందే: ఎస్సై

కృష్ణా: చల్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీట్ హోల్డర్లకు ఎస్సై కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని తెలిపారు.