హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదపారుపూడిలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ

కృష్ణా: పెదపారుపూడి మండలంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ముసాయిదా జాబితాలను మండల పరిషత్ కార్యాలయంలో ప్రచురించారు. తొలి అంకంగా ఎంపీటీసీ, పంచాయతీల పోలింగ్ కేంద్రాల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర వసతులను పరిశీలించారు.