హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

ATP: శెట్టూరు ఎస్సీ వసతి గృహంలో పాత గోడ కూలి 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందగా, అక్షయ్ గాయపడ్డారు. కళ్యాణదుర్గం ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు బాధితులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50 వేలు అందజేశారు. ప్రభుత్వం నుంచి కూడా తగిన ఆర్థిక సాయం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.