KDP: ఒంటిమిట్ట మండలంలోని దర్జిపల్లి రహదారిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. మృతుడి చిరునామా, వివరాలు తెలియరాలేదు. కొంతకాలంగా స్థానికంగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పంచాయతీ అధికారులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని వ్యక్తి మృతి


