KMR: బీబీపేట మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అల్లం చంద్రం ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నవీన్‌చంద్ర తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ నయం కాకపోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
తెలంగాణ
జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య


