హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కటికి జలపాతం అందాలను చూసోద్దామా..!

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కటికి జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. బొర్రా గుహలకు సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది. పచ్చని కొండలు, అటవీ అందాల మధ్య జలపాతం చూపరులను కనువిందు చేస్తుంది. వర్షాకాలంలో దీని అందం మరింత పెరుగుతుంది.