హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లంబసింగి.. చలిని ఆస్వాదించాల్సిందే..!

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి ప్రకృతి అందాలకు, చల్లని వాతావరణానికి ప్రసిద్ధి. సముద్ర మట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉండటంతో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. పొగమంచు, పచ్చని కొండలు, కాఫీ తోటలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. చలికాలంలో లంబసింగికి సందర్శకుల తాకిడి పెరుగుతుంది.