హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాతారావు కుటుంబానికి అండగా ఉంటాం'

కోనసీమ: కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుడు సంగాని తాతారావు ఈ నెల 3న ఓడలరేవు నుంచి వేటకు బయలుదేరిన పడవ ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. వారి కుటుంబ సభ్యులను ఆదివారం ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, వైసీపీ రాష్ట్ర పార్టీ ప్రచార విభాగ కార్యదర్శి వల్లభనేని దొరబాబు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామన్నారు.