హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్టీ నేతకు మాజీ మంత్రి పరామర్శ

కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి గాడి రాజుబాబును మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం పరామర్శించారు. ఇటీవల గాయపడిన రాజుబాబును కె. ఎ.మల్లవరంలోని ఆయన స్వగృహంలో నాయకులు అంకంరెడ్డి రమేష్, పోతల సూరిబాబుతో కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాసేవకు అందుబాటులో ఉండే ఆయన త్వరితగతిన కోలుకొని ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని యనమల ఆశించారు.