కడప జిల్లా అట్లూరు మండలంలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపి, వెంకటరమణ, గోపాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. గుజ్జులవారిపల్లి సమీపంలో జరిగిన ఘటనను గమనించిన స్థానికులు క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. గోపి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
అట్లూరులో రెండు బైక్‌లు ఢీ


