హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో బోల్తా.. కూలీలకు తీవ్ర గాయాలు

ATP: బళ్లారి సమీపంలో హైవేపై కొంతమంది కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామానికి చెందిన 26 మంది వ్యవసాయ కూలీలు కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ఇమరాపురం సమీపంలో వరినాట్లు వేసేందుకు ఆటోలో బయలుదేరారు. బళ్లారి సమీపంలో హైవేపై టైరు పేలడంతో  ఆటో బోల్తా పడింది. ఈ ఘటనతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.