హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవుని కడపలో పెళ్లిళ్ల సందడి

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆదివారం భాజా భజంత్రీలతో మార్మోగింది. శ్రావణమాసం కావడంతో ముహూర్తాలు అధికంగా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవుని కడపలో వివాహం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఒకేరోజు పలువురు వివాహాలు చేసుకున్నారు. పెళ్లికొడుకులు, పెళ్లికూతుళ్లు, బంధువులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.