హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ నవీన్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.