AKP: చోడవరంలోని శ్రీ గాయత్రీ రెసిడెన్షియల్ స్కూల్‌లో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వైద్యులు 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మందులు, ఐ డ్రాప్స్ అందించారు.22 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేసి ఆసుపత్రికి తరలించారు. ట్రస్ట్ చైర్మన్ గొంప వెంకటరావు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు ఉచిత కంటి వైద్య సేవలు


