ప్రకాశం జిల్లా దర్శి(M) వెంకటాచలంపల్లిలో రూ.18.50 కోట్లతో చేపట్టిన ఐడీటీఆర్ ప్రాజెక్టు పనులు పదేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. 2016లో శంకుస్థాపన చేసినా బిల్లుల చెల్లింపులో జాప్యంతో నిర్మాణం నిలిచిపోయింది. ఏటా వెయ్యి మందికి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాన్ని ప్రతిపాదించారు. పనుల పూర్తికి తాజాగా కొత్త టెండర్లు పిలిచామని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పదేళ్లుగా పూర్తికాని ఐడీటీఆర్ ప్రాజెక్టు!


