హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమవారం కలెక్టరేట్‌లో PGRS

తిరుపతి కలెక్టరేట్‌లో ఈ నెల 24న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీల రసీదులు తీసుకురావాలని సూచించారు. అర్జీల స్థితి తెలుసుకునేందుకు 1100కు కాల్ చేయవచ్చని చెప్పుకొచ్చారు.