హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యలంక బీచ్‌కు సందర్శకుల తాకిడి

బాపట్లలోని ప్రముఖ సూర్యలంక బీచ్‌కు ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబాలు, యువత సముద్ర తీరంలో సందడి చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పర్యాటకుల ఆకర్షణ మరింత పెరుగుతోంది. సందర్శకులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.