హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం: DRO

కడప కలెక్టరేట్‌లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మల్లికార్జునుడు మాట్లాడుతూ.. ఆంధ్రుల ఆవేశానికి, ఆత్మవిశ్వాసానికి ప్రకాశం పంతులు ప్రతీక అని అన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, కృష్ణా బ్యారేజీ నిర్మాణానికి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.