కృష్ణా: పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామంలో పద్మాల అంకమ్మ తల్లి జాతరను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. పాల పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు. డప్పు వాయిద్యాలు, యువత కేరింతల మధ్య అమ్మవారిని గ్రామ వీధుల్లో ఘనంగా ఊరేగించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీరంకిలాకులో అంకమ్మ తల్లి జాతర


