WG: భీమవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ CI రమేశ్ హెచ్చరించారు. ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పాత పద్ధతులు మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని CI వారికి సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ నేర ప్రవృత్తికి దూరంగా జీవించాలని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీ షీటర్లకు వన్ టౌన్ సీఐ హెచ్చరిక


