హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రకాశం పంతులు చూపిన తెగువ స్ఫూర్తిదాయకం'

WG: భీమవరం ప్రకాశం చౌక్ వద్ద 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో MLA పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి CMగా ప్రకాశం పంతులు చేసిన త్యాగాలు భావితరాలకు ఆదర్శమని ఆయన కొనియాడారు. దాతల సాయంతో టంగుటూరి విగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయమన్నారు.