హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

1100 ద్వారా సమస్యను చెప్పొచ్చు: కలెక్టర్

WG: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. దూర ప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.