NTR: నందిగామ మండలం ఐతవరం గ్రామంలో నూతన ముత్యాలమ్మ పోతురాజు దేవస్థానం నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఏపీ విప్ తంగిరాల సౌమ్య, కూటమి నేతలు పాల్గొని పూజలు చేశారు. దేవస్థానం నిర్మాణం త్వరగా పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఆధ్యాత్మికత, ఐక్యత పెంపొందించేలా దేవస్థానాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముత్యాలమ్మ ఆలయానికి భూమిపూజ


