హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారుమంచాలలో రోడ్డుపై మురుగునీరు

NDL: జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలోని కోటవీధిలో మురుగునీరు రోడ్డుపై చేరి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు కర్ణ ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్డుపై నీరు చేరుతోందని, వ్యాధుల ముప్పు ఉందని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.