హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో ఎంపీడీవో ఆఫీస్ ప్రారంభం

NDL: డోన్ పట్టణంలో ఆదివారం జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనాన్ని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ భవనం సమావేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.