హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం

KDP: వేంపల్లి మండలం నాగూరు గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. పొలాల వద్ద ఉన్న ఈ స్తంభం ఏ క్షణంలో కూలుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కనే ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు స్పందించి స్తంభానికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.