హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరదేశమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

VSP: భీమిలి మండలం ఉప్పాడలో పరదేశమ్మ అమ్మవారి నూతన దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పరదేశమ్మ అమ్మవారి ఆలయం గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా అవసరమైన సహకారం అందిస్తామన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.