హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గో సంరక్షణ కోసం అలిపిరిలో పొర్లుదండాలు

NLR: గో సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని నెల్లూరుకు చెందిన బాలాజీ అలిపిరి మార్గంలో పొర్లుదండాలు పెట్టాడు. గోజాతి అంతరించిపోకుండా, గోహత్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించి సంరక్షించాలనే సంకల్పంతో ఆయన 13వ సారి ఇలా తిరుమలకు వచ్చినట్లు తెలిపారు.