హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కలిగిరిలో భారీగా గ్రావెల్ తరలింపు

NLR: కలిగిరిలోని పెద్ద చెరువు నుంచి అనుమతులకు విరుద్ధంగా గ్రావెల్, మట్టిని భారీగా తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఒక హిటాచి, రెండు టిప్పర్లు, పది ట్రాక్టర్లతో మట్టిని తవ్వి సమీపంలోని కమర్షియల్ లేఔట్లకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.