హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచితంగా మందులు పంపిణీ

NLR: సీతారామపురం మండలం బసినేపల్లి హైస్కూల్ ప్రాంగణంలో P4లో భాగంగా జనసేన నాయకులు శ్రీ హర్ష ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేశారు. ప్రజలకు ఉచితమైన వైద్య సేవలు అందించడంతోపాటు, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.