హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మజ్జిలిపేటలో క్లీన్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

SKLM: పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన  క్లీన్ వాటర్ ప్లాంట్‌ను ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PUC) చైర్మన్ కూన రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారని, గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.