హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ వివాదం.. కర్రలతో దాడి

అన్నమయ్య: మదనపల్లె మండలం సిటిఎం గ్రామం చిలకవారిపల్లెకి చెందిన రైతు మేకల నాగరాజా (40)పై భూ వివాదం కారణంగా ప్రత్యర్థులు కర్రలతో దాడి చేశారు. ఆదివారం జరిగిన ఈ గొడవలో నాగరాజా తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆసుపత్రి అవుటో పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.