హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్దిలేటి స్వామిని దర్శించుకున్న పత్తికొండ ఎమ్మెల్యే

NDL: బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో ఆదివారం పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్యాంబాబు పర్యటించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు అధికారులు కలిసి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మద్దిలేటి స్వామి ఆలయంలో ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.