కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి శిరిగినీడి వెంకన్న నాయుడు, ఈశ్వరమ్మ దంపతులు రూ.25 వేల విరాళం అందజేశారు. ఆదివారం ఆలయ ఛైర్మన్ కంచిపల్లి అబ్బులుకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పెళ్లిళ్ల వెంకన్న అన్నదాన పథకానికి విరాళం


