హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కోట్ల ఆగ్రహం

NDL: డోన్ ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ఆదివారం సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులకు సమాచారం లేకుండా వైసీపీ నాయకులు ప్రారంభించడం ప్రోటోకాల్‌కు విరుద్ధమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాలను రాజకీయ ప్రచారానికి వినియోగించరాదని, ఘటనపై విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.