హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి'

NRML: సీఎంఆర్ బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు పసుపుల వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రం కడెంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రైస్ మిల్లులో జరుగుతున్న అవినీతి, అక్రమాలు చేస్తున్న యజమానులపై కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.